Site icon 123Nellore

షణ్ముక్, దీప్తి లవ్ ని ఒక్క మాటతో అవమానపరిచిన సిరి!

shanmuk And Deepti: బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 లో షన్ను, సిరిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ ఫ్రెండ్షిప్ ముసుగులో చేసిన హగ్గులు, కిస్సులు వాళ్లకి రుచికరంగానే ఉన్నపటికీ.. సెలబ్రేటీల నుంచి నెటిజన్ల వరకు ఈ రచ్చను ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. హౌస్ నుంచి బయటకు వచ్చేవరకు వారిరువురు అదే విధంగా కంటిన్యూ చేసారు.

shanmuk And Deepti

దీంతో వీరిరువురు నెటిజన్ల నోట్లో నాని పోయారు. అలా షన్ను ప్రియురాలైన దీప్తి సునయన కూడా అసహనం వ్యక్తం చేసి సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా గ్రామ్ లో తమ రిలేషన్ కి బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని తమ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఆ మధ్య వీరిద్దరి బ్రేక్ అప్ నెటిజన్లలో పెద్ద దుమారాన్నే రేపింది. కొందరు నెటిజన్లు అయితే వీరిద్దరి రిలేషన్ బ్రేక్ అవడానికి సిరినే ప్రధాన కారణంగా సూచించారు. అంతేకాకుండా మీమ్స్ రూపంలో దుమ్మెత్తిపోశారు. దీంతో సిరి తన ఇన్ స్టా ఖాతా ద్వారా స్పందించింది. తన వల్ల వారు విడిపోవడం కరెక్ట్ కాదని.. వాళ్ళ లవ్ అంత వీక్ ఆ అన్నట్లు అవమానపరిచింది.

నిజానికి దీప్తి, షన్ను తన వల్ల విడిపోలేదని.. బిగ్ బాస్ హౌస్ లో షన్ను, జెస్సీ లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ షన్ను మధ్య ఉండేది కేవలం స్నేహం మాత్రమే అని బయట ఉన్నప్పుడు చాలామంది ఎమోషన్స్ చూస్తాం. అదే హౌస్ లో మాత్రం 19 మంది కంటెస్టెంట్ ల ఎమోషన్స్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టే షన్ను విషయంలో ఆ ఎమోషన్ కొంచెం ఎక్కువైంది అని సిరి తెలిపింది.

Exit mobile version