Site icon 123Nellore

ఐదేళ్ల క్రితం మాయమైన 500 కోట్ల విలువైన శివలింగం.. ఇంతకూ అసలు ఏం జరిగిందంటే?

మామూలుగా ఏదైనా విలువైన వస్తువులు దొంగలించబడుతూ ఉంటాయి. వాటిని మరొక చోటికి అక్రమంగా రవాణా కూడా చేస్తుంటారు. అలా ఇప్పటికి చాలా విలువైన వస్తువులు కాజేయబడ్డాయి. ముఖ్యంగా దేవాలయాల్లో మాత్రం ఎన్నో విలువైన విగ్రహాలు పోయాయి. ఇదిలా ఉంటే తాజాగా క్రితం మాయమైన 500 కోట్ల విలువ చేసే శివ లింగం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆ శివలింగం చోళుల కాలం నాటిదని.. అప్పట్లో కాంబోడియా నుంచి భారత్ కు తెచ్చి ధర్మపురం ఆధీనులకు ఇచ్చారని తెలిసింది. ఇక దాంతో వాళ్లు తిరుక్కువలై బ్రహ్మపురీశ్వరార్ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేశారు. అలా వెయ్యేళ్ల పురాతన లింగం 2016లో మాయం అయింది. ఆ శివలింగం విలువైనదని.. అసలు అది శివలింగమని పండితులు చెప్పారు.

అది ఒక్కటే వెయ్యి లింగాల కు సమానం అని తెలిపారు. ఆ శివలింగం చాలా చిన్నదని కేవలం 8 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుందని దాని బరువు అర కేజీ ఉంటుందని తెలిసింది. అలా 2016లో కనిపించకుండా పోయిన ఈ విగ్రహం ఎంత వెతికినా దొరకలేదు.

ఇటీవలే ఆ శివలింగం ఓ వ్యాపారి బ్యాంకు లాకర్ లో ఉందని తెలిసింది. తంజావూర్ లో అరుల నగర్ లో ఉండే అరుణ్ భాస్కర్ పాత విగ్రహాలను, దేవుళ్ల ప్రతిమలను దొంగలించి వాటిని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాడని పోలీసులకు తెలియటంతో అతన్ని పట్టుకున్నారు.

అతడిని విచారించగా అతడి దగ్గర పచ్చ శివలింగం ఉందని దానిని బ్యాంకు లాకర్ లో దాచానని తెలిపాడు. ఆ విగ్రహం తనకు 80 ఏళ్ల తన తండ్రి ఇచ్చాడని తెలిపాడు. ఆ విగ్రహాన్ని చెన్నైకు తీసుకొచ్చిన అధికారులు సైంటిఫిక్ ఎనాలసిస్ చేయటంతో అది నిజమే అని తేలింది. చివరకు దానిని ఆలయ నిర్వాహకులకు అప్పగించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

Exit mobile version