బడా వ్యాపారవేత్తలు,సెలబ్రిటీలను తన మాయ మాటలతో నమ్మించి వారి నుంచి పెట్టుబడికి డబ్బులను పెద్ద మొత్తంలో తీసుకొని తిరిగి వడ్డీ రూపంలో చెల్లిస్తానని మాయ మాటలు చెప్పి చివరికి ఎంతో మందిని మోసం చేసిన నటి శిల్పా చౌదరి బాగోతం అం అం గత కొద్ది రోజుల క్రితం బయటపడటంతో ఈమె పై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు శిల్ప చౌదరి ఆమె భర్తను కస్టడీలోకి తీసుకున్నారు.
అదేవిధంగా ఈమె ఎంతో మందిని మోసం చేసి సుమారు 32 కోట్ల వరకు డబ్బులను మాయ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా మూడు రోజుల నుంచి శిల్పా చౌదరి ఆమె భర్తను విచారించిన పోలీసులు నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నారు.ఇకపోతే తనను మోసం చేసిన డబ్బును తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో అధికారులు వీరి బ్యాంక్ ఖాతాల గురించి విచారించగా దిమ్మతిరిగే విషయం బయట పడింది.కోట్లలో డబ్బులను మాయ చేసిన శిల్పా చౌదరి అకౌంట్ లో ప్రస్తుతం 16 వేలు, తన భర్త అకౌంట్లో 14000 ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.అయితే ఈమె అందరి దగ్గర మోసం చేసి తీసుకున్న డబ్బులను ఎక్కడకు మళ్ళించింది అనే విషయమై విచారణ జరగనుంది.