Site icon 123Nellore

ఆమెకు రెండు గర్భాశయాలు.. ఇరవై రెండు వారాలకే అద్భుతం.. కానీ ఏం జరిగిందంటే?

మామూలుగా ఎవరికైనా ఒక గర్భాశయం మాత్రమే ఉంటుంది. కానీ ఓ యువతికి మాత్రం రెండు గర్భాశయం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నెబ్రాస్కాల్ కు చెందిన మెగాన్ ఫిప్స్ అనే 24 ఏళ్ల యువతికి తాను పుట్టినప్పుడే యుటెరిన్ డైడెల్ఫిస్ అనే సమస్యతో పుట్టింది.

దీంతో ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నాయి. దీంతో ఆమె ఒకేసారి తన రెండు గర్భశయాల్లో గర్భం దాల్చింది. ఇంతకు ముందే తను రెండు సార్లు గర్భం దాల్చింది. ఇక మరో సారి ఈ ఏడాది గర్భం దాల్చగా తనకు కవలలు పుడతారని తేలింది. కానీ ఆరు నెలలకే అనగా 22 వారాలకే ఇద్దరు పాపలకు జన్మనిచ్చింది.

అందులో జూన్ 11న రిలే అని మొదటి పాప పుట్టగా.. జూన్ 12న రీస్ అనే రెండో పాప పుట్టింది. ఇక వారిద్దరు అర కేజీ బరువు కూడా లేరు. దీంతో పెద్ద పాప 12 రోజులకు మరణించింది. ఇక మరో పాప బతికే ఉండగా ప్రస్తుతం తను హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. మరో ఆరు నెలల వరకు ఆ పాపను డాక్టర్లే చూసుకోవాలట.

ఇక 40 రోజులు వెంటిలేటర్ తో పాటు 12 సార్లు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఇక ఈ పాప బతికే అవకాశం ఉందని కానీ భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇక ఇలా అరుదుగా జరుగుతుందని వైద్యులు అంటున్నారు.

Exit mobile version