బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులకు మార్చుకుంది. ప్రస్తుతం నా పేరు మీనాక్షి సీరియల్ లో టైటిల్ పాత్రను పోషిస్తుంది. ఈ అమ్మడికి బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
కన్నడ సీరియల్ తో బుల్లి తెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది. ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయం అయింది. ఆ తర్వాత స్టార్ మా లో ఆమె కథ సీరియల్ లో కూడా నటించగా ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది.
ఇక ఇందులో తనతో పాటు నటించిన రవి కృష్ణ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇక అతనితో ఈ ముద్దుగుమ్మ రిలేషన్ లో ఉందని బాగా వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అవన్నీ పుకార్లే అని తామే చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో తన సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఈ కొత్త ఏడాదిలో తను క్లీన్ మైండ్, హార్ట్ తో అడుగు పెడుతున్నట్లు తెలిపింది. తనకు ఎవరైనా రుణపడి ఉంటే దాని గురించి చింతించకండి అని తనను ఎవరైనా అన్యాయం చేస్తే.. అంతా మంచిదే అని.. తన పై కోపంగా ఉంటే తామే గెలిచారు అని అనుకొని వాడిని వదిలి పెడతానని తెలిపింది. తప్పు చేస్తే క్షమించండి అంటూ.. ఇక ఈ జీవితం చాలా చిన్నది అంటూ పెండింగ్లో ఉన్న కోపాలను, పగలు, ఒత్తిడిని వదిలేయమని ఈ ఏడాది ని ఎంజాయ్ చేయండి అని తెలిపింది.