Site icon 123Nellore

‘సర్కారు వారి పాట’ సక్సస్ పార్టీ.. నెట్టింట ఫోటోలు వైరల్

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.  ఈ సినిమాలో సముద్రఖని, నదియా, తనికెళ్లభరణి కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల రాబడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ .. మూవీ యూనిట్‌కి శుక్రవారం విందు ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఈ పార్టీ జరిగింది. ఇందులో మహేశ్‌బాబు నమ్రత దంపతులు, పరశురామ్‌ దంపతులు, సుకుమార్‌, బుచ్చిబాబు, హరీశ్‌శంకర్‌, దిల్‌రాజు, శిరీష్‌.. తదితరులు పాల్గొన్నారు. ‘సర్కారువారిపాట’ సక్సెస్‌ పార్టీ ఎంతో సరదాగా సాగిందంటూ నమ్రత ఫొటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సర్కారు వారీ పాట చిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజున 36.63 కోట్ల షేర్ సాధించింది. ఇక రెండో రోజున ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో మరో 11.64 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో రెండో రోజుల్లో మొత్తంగా 48.27 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో రెండు రోజుల్లో మొత్తంగా 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే శుక్రవారం దారుణంగా వసూళ్లు డ్రాప్ కావడంతో ఇక శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లు ఉంటాయని చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకొంది. ఈ శని, ఆదివారాల్లో సినిమా ఎలాంటి ఫలితాలను రాబడుతుందో అనే విషయంపై సినీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Exit mobile version