టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తూ ఉంది. ప్రస్తుతం సమంత చేతి నిండా వరుస ఆఫర్లు ఉన్నాయి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు సినిమాలను నిర్మించడానికి దర్శక నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. విడాకుల తర్వాత సమంతా సోషల్ మీడియాలో ఎటువంటి రకాల పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతూనే ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే నాగ చైతన్య పుట్టినరోజు సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని నెటిజన్స్ సమంతను దారుణంగా ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత స్నేహితులుగా కలిసి ఉంటాము అన్నారు కదా మరి నాగచైతన్యకు ఎందుకు బర్త్డే విషెస్ చెప్పలేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్యకు బర్తడే విషెస్ చెప్పకపోయినా హీరో రానాకు మాత్రం సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.
సమంత సోషల్ మీడియా వేదికగా రానాకు బర్త్డే విషెస్ చెబుతూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు రానా.. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా అని తెలిపింది. రానాను పెద్ద మనసున్న వ్యక్తివి అని శక్తివంతమైన వ్యక్తిని అని సమంత అంది. అంతేకాకుండా రానా దేవుడికి ఇష్టమైన వాడు అంటూ సమంత కామెంట్స్ చేసింది. సామ్,హీరో రానా గురించి పాజిటివ్ గా పోస్ట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయంపై స్పందించిన రానా.. థాంక్యూ సో మచ్ రూత్ అంటూ రాసుకొచ్చారు. ఇక చైతన్యకు, రానాకు మధ్య స్నేహితులుగా మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఒకప్పుడు చైతన్య, సమంత పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ నీ రానా ఒప్పించారు అని సామ్ జామ్ లో సమంతా పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత నాగ చైతన్య కు బర్త్డే విషెస్ చెప్పకపోయినా హీరో రానాకు మాత్రం విషెస్ చెప్పారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.