Site icon 123Nellore

కొత్త రికార్డులు సృష్టిస్తున్న సమంత స్పెషల్‌ సాంగ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇక దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా.. స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డిసెంబర్ 10వ తేదిన విడుదలైన ఈ లిరికల్ సాంగ్ కేవలం 20 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.

అగ్రకథానాయిక సమంత మొదటిసారి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయడం.. బన్నీతో ఆమె వేసిన మాస్‌ స్టెప్పులు.. ఇలా ఎన్నో విషయాలు ఈ పాట సక్సెస్‌కు దోహదపడ్డాయి. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌తో పాటు, చంద్ర‌బోస్ అందించిన లిరిక్స్ పాట‌కు హైలెట్‌గా నిలిచాయి. తాజాగా ఈ పాట 200పైగా మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ విషయంపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఊరమాస్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషించారు.

ఇక సామ్ ప్రస్తుతం తమిళంలో విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో చిత్రం ‘యశోద’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

Exit mobile version