ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సాయిపల్లవి. అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసే ఈ మల్టీ ట్యాలెంటెడ్ మలయాళం ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడం లేదు. ఈ క్రమంలో ఆమె పెళ్లికి రెడీ అవుతుందనే రూమర్లు పుట్టుకొచ్చాయి.
ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ‘విరాటపర్వం’ అనే ఒకే ఒక చిత్రం మాత్రమే ఉంది. రానా హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం టాలీవుడ్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. విరాటపర్వం రిలీజ్ తర్వాత సాయి పల్లవి పెళ్లి పీటలెక్కబోతుందట. అందుకే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త చిత్రాలను ప్రకటించలేదని టీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
భోళాశంకర్ లో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్ ఆఫర్ చేస్తే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించింది. నటిగా తనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేయాలనుకుంటోందట.అందుకే సినిమా కొత్త సినిమాలను ప్రకటించలేదు. రాబోయే చిత్రంలో తన రోల్ లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్‌ని మించి ఉండాలని పల్లవి కోరుకుంటోంది. సాయి పల్లవి సన్నిహితులు కూడా అదే చెబుతున్నారు. మరి సాయి పల్లవి నిజంగానే మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తుందో.. లేదా పెళ్లి కోసమే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంలేదో తెలియాలంటే.. ఆమె ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.