Sai Pallavi And Naga Shourya: సాయి పల్లవి సినీ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి. ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వచ్చిన ‘ఫిదా’ తో ప్రేక్షకులను మరింత ఫిదా చేసింది. ఇక ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది.
ఇక ఇటీవల వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ఈ అమ్మడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి హీరో నాగ సౌర్య కు ఒక రేంజ్ లో రిప్లై ఇచ్చింది. నాగ శౌర్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘కణం’ సినిమా మనందరికీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిరువురి మధ్య మాట మాట ఘర్షణ ఏర్పడింది.
ఈ సినిమా విడుదల సమయంలో నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సాయి పల్లవి గురించి నెగిటివ్ గా విమర్శించాడు. సాయిపల్లవి అన్ ప్రొఫెషనల్ హీరోయిన్ అని.. అనవసరమైన విషయాలలో తలదూర్చి సహనం కోల్పోవడం ఆమెలో తన గుణమని నాగ సౌర్య ఓపెన్ గా చెప్పేసాడు.
మరి ఈ విషయం పై ఆ సమయంలో స్పందించని సాయి పల్లవి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తాజాగా స్పందించింది. అందుకోసం ‘కణం’ చిత్ర దర్శకుడు ఎ.ఎల్.విజయ్ కు ఫోన్ చేసి ‘ షూటింగ్ లో నావల్ల ఏమైనా ఇబ్బందులు పడ్డారా ‘ అని అడిగింది. దానికి అయన అలాంటిదేమీ లేదు అని చెప్పగా..’యాక్టర్ సౌర్య అంటే నాకు రెస్పెక్ట్ ఉంది.
నిజంగా అతను నా వల్ల అతను సెట్ లో ఇబ్బంది పడ్డాడు అంటే నాకు చాలా బాధగా ఉంది. నా ఆన్సర్ తో ఇప్పుడైనా అతను సంతృప్తి పొందుతాడని కోరుకుంటున్న’ అని దిమ్మ తిరిగి రిప్లై ఇచ్చింది.