Site icon 123Nellore

భారత్‌లోనే తొలి చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రాజమౌళి దర్శకత్వంలో, ఎన్టీర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఈ చిత్రం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని భాషలతోపాటు, ఇతర దేశాల్లోనూ విడుదలవుతుండడంతో ఓవర్‌సీస్‌లోనూ RRR మార్కెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం ‘డాల్బీ సినిమా’ టెక్నాలజీను వాడబోతున్నారు. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవబోతుంది. ఓవర్సీస్‌లో ఐమాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్‌లో సినిమాను ప్రీమియర్ షోగా ప్రదర్శించడానికి ఈ డాల్బీ సినిమా టెక్నాలజీను వాడతారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద తెర ఉన్న యూకేలో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నారు. ఈ తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో చిత్ర బృందం ప్రమోష్స్‌ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో మార్చి 14న ఈ సినిమా నుంచి ‘ఎత్తరా జెండా’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. అలానే దుబాయ్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version