సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు నేరుగా సెలబ్రెటీలతో మాట్లాడగలిగే అవకాశం కూడా వచ్చింది.ఇలా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు కూడా అభిమానులకు అందుబాటులో ఉంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మరింత ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రిటీలు వారి త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇక ఈ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఈమె తాజాగా తన కాబోయే వరుడు ఎలా ఉండాలో బహిరంగంగా ప్రకటించింది. ఇక ఈమె విజయ్ దేవరకొండ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చారా… అదేనండి పెళ్లి చూపులు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తాజాగా వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకులను సందడి చేసిన రీతూవర్మ. ప్రస్తుతం ఎంతో అందంగా ఉన్నటువంటి రీతూవర్మ చిన్నప్పుడు ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంది కదూ.