Site icon 123Nellore

రాజీనామా చేసిరా.. మాట్లాడుదాం : చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని, మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదుని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ మూడురాజధానులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. విజయవాడ, గుంటూరు మధ్య పెడితే అభ్యంతరం లేదనబట్టే 33 వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చారన్నారు. మోసాలు, ఘోరాలు చేయడంలో జగన్  దిట్ట అని దుయ్యబట్టారు. ప్రజలకు అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలన్నారు. ఇంకా ఏమన్నారంటే…‘‘ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం మన దురదృష్టం. రాష్ట్రానికి జగన్ ఒక శని గ్రహంలా తయారయ్యారు. నమ్మక ద్రోహం చేసిన మీకు పాలించే హక్కు లేదు. రాజీనామా చేయండి.. అప్పుడు రండి మాట్లాడుదాం.

ఇది భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు చేయలేరు. సీఎం తన పేరును జగన్ మోసం రెడ్డి పెట్టుకోవాలి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. రాజధాని నిర్ణయించిన తర్వాత మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అమరావతిలో సీఎంకు ఇల్లు ఉంటే సరిపోదు.. మనసుండాలి. తప్పుడు కేసులు పెడుతుంటే కోర్టు ప్రశ్నించకూడదా? మీకు వక్రబుద్ధులు ఉన్నాయి.. వక్రీకరించి మాట్లాడుతున్నారు. ల్యాండ్ పూలింగ్‍లో రియల్ ఎస్టేట్ ఎంటి? – జగన్ రాజధానిలో ఇల్లు కట్టుకుని ఏం చేశారు?.

150 మంది ఉన్నారని విర్రవీగుతున్నారు. ప్రజలు తలచుకుంటే చివరికి సున్నా మిగులుతుంది. సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న రైతులు వెనక్కి తగ్గితే.. ప్రభుత్వం ఊరుకునేదా?. సీబీఐ, కోర్టులు స్వతంత్ర వ్యవస్థలు. వైసీపీ నేతలే హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారు. కోర్టులను తప్పుపట్టడం, దూషించడం సరికాదు. ఈ మూడేళ్లలో అమరావతి వాసులు తీవ్రంగా నష్టపోయారు. నేను వేధిస్తే.. జగన్ పాదయాత్రలు చేసేవారా? ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే’’ అని పేర్కొన్నారు.

Exit mobile version