సూర్యుని వలే ప్రకాశిస్తూ అందరి చూపును తనవైపే ఆకర్షించేలా ఉండే పువ్వుల్లో పొద్దు తిరుగుడు పువ్వును అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి పువ్వు కేవలం అందానికే కాదు మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పొద్దు తిరుగుడు నూనెను అన్ని వంటకాల్లో వాడుతూ ఆస్వాదిస్తూ ఉంటాం. అయితే పొద్దు తిరుగుడు పువ్వులు, నూనెను కాదండోయ్ విత్తనాల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అవి మీరు తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుని మరి.
పొద్దు తిరుగుడు గింజలను తీసుకోవడం ద్వారా అధిక బరువు, మధుమేహం , గుండె సమస్యలు రక్తాన్ని శుద్ధి చేయడం జ్ఞాపక శక్తిని పెంచడం వంటి వంటి ఎన్నో ప్రయోజనాలు పొద్దుతిరుగుడు గింజలు ఉన్నాయి.పొద్దుతిరుగుడు పువ్వులను మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. పొద్దుతిరుగుడు గింజలు సలాడ్స్ లేదా ఓట్స్ రూపంలో తీసుకుంటే తక్కువ వ్యవధిలో బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలానే ఈ గింజలను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ గింజల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్పోర్ట్స్ ఆడే పిల్లలకు ఉదయాన్నే గుప్పెడు గింజలను వారి ఆహారంలో ఇవ్వడం వలన ఎనర్జీ లెవెల్స్ అధికమవుతాయి. పొద్దుతిరుగుడు గింజలు రోగనిరోధకశక్తిని ఎంతగానో తోడ్పడతాయని నిపుణులు తెలుపుతున్నారు.