Site icon 123Nellore

తెల్ల కంగారూలను ఎప్పుడైనా చూశారా..?

ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. అయితే ఇటీవల నెట్టింట్లో ఓ వింత జంతువుకు సంబంధించిన వార్త ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా.. అదే తెల్ల కంగారూ. సాధారణంగా కంగారూలు ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఇవి చూసేందుకు వీట్ కల్లర్లో ఉంటాయి. ఇప్పటి వరకు చూసిన చాలా కంగారులూ ఇలానే కనిపించాయి. అయితే ఓ కంగారూ మాత్రం వింతగా తెలుపు రంగులో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో ఇలాంటి కంగారులు కూడా ఉంటాయా అని అక్కడి స్థానికులు ముక్కున వేలు వేసుకున్నారు. ఇంతకీ దాని కథ ఏంటి అని అనుకుంటున్నారా..?

Rare White Kangaroo Spotted In Australia

ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంతం అయిన క్వీన్ లాండ్ లో ఓ మహిళకు తెల్ల కంగారూ కనిపించింది. దీనిని ఆమె చూసి ఆశ్చర్యపోయింది. అంతటితో ఆగకుండా వాటిని ఫోటోలు కూడా తీసింది. అవి అక్కడ ఉన్న గడ్డిలో పరిగెత్తుకుంటూ పోయాయని ఆమె తెలిపింది. ఇలా ఆమె తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ఈ వైట్ కంగారూను చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. నిపుణులు అయితే దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇంతకీ ఈ మహిళ చెప్తుంది నిజమా కాదా అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. ఇలాంటి కంగారూలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఈ మహిళ చెప్తుంది నిజం అయితే నిజంగానే ఇది పెద్ద వింత అని చెప్తున్నారు.

Exit mobile version