మనం చుట్టూ ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిని తెలుసుకోవాలి అనే కోరిక కూడా మనల్ని కుదురుగా ఉండనివ్వదు. అలా ఆసక్తి కలిగిన దాని మీద లోతుగా తెసుకుంటూ పోయే వారు పరిశోధకులు అవుతారు. కానీ కొంత మందికి ఈ కొత్త, వింత విషయాల పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటిలోని కొన్ని వింతలు ఆసక్తికరమైనవిగా ఉంటే, కొన్ని మాత్రం భయపెట్టేలా ఉంటాయి. వాటిని చూస్తే ఒళ్లంత ఒక్కసారిగా జలదరిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఓ వింత కూడా అలాంటే.
న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్ లో ఉండే సముద్రంలో ఓ వింత జంతువుని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది 1.2 కిలోమీటర్ల దూరంలో ఉండగా దీనిని పసిగట్టి ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఇది చూసేందుకు చాలా భయం కరంగా ఉంది. నిజానికి దానిని చూసిన వెంటనే ఆ పరిశోధకులు కూడా నిశ్చేష్టులుగా మారి షాక్ కు గురైనారు. దీనికి కారణం లేకపోలేదు. పరిశోధకులు గుర్తించిన జంతువు కళ్లు, మూతి చాలా పెద్దవిగా ఉన్నాయి. దీనితో పాటు ఆ జంతువు ఆకారం కూడా చాలా భయపెట్టేలా ఉంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్పీయర్ రీసెర్చ్ పరిశోధకులు వారు చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ వింత జీవిని సముద్రంలో గుర్తించారు. శాస్త్రవేత్తలు దీనిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఆ జంతువును బేబీ షార్క్ గా నిర్ధరించారు. సాధారణంగా షార్కులు సముద్రం కింద భాగంలో ఉండే నేలపైన గుడ్లను పెడతాయి. అయితే పరిపక్వత చెందిన తరువాత వాటి నుంచి చిన్న షార్కులు బయటకు వస్తాయి. ఈ క్రమంలోనే అడుగు భాగంలో ఘోస్ట్ షార్క్ లు తిరుగుతాయి. ఇవి అన్నీ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.