నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’… వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మించి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రం నుండి మూడవ సింగిల్‌గా ‘రాంగో రంగ’ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సింగర్ కారుణ్య ఈ పాటని అద్భుతంగా ఆలపించారు. సానాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యాన్ని అందించారు. పాథటిక్ సిట్యువేషన్ నేపథ్యంలో ఈ పాటని నానిపై చిత్రీకరించారు. `మొక్కిందోటి.. దక్కిందోటి ..ఇన్నోటి నోడించి ఇస్తార్నే లాగేస్తారా? .. అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఒక బ్రాహ్మణ యువకుడికీ, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. నరేష్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.