Site icon 123Nellore

వారికి క్షమాపణలు తెలియజేసిన సింగర్ సునీత భర్త!

Ram Veerapaneni: సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో పాటలకు ప్రాణం పోసి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సునీత భర్త రామ్‌ వీరపనేని అని మన అందరికీ తెలిసిందే. ఆయన ‘మాంగో మాస్ మీడియా’ డిజిటల్ కంపెనీ ను నిర్వహిస్తున్నాడు.

ఆయన కొన్ని సినిమాలను డిజిటల్ రైట్స్ లో కొంటాడు. ఆ సినిమాలను యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేస్తాడు. ఇదిలా ఉంటే అలా కొనుగోలు చేసిన సినిమాలో ఓ సీన్ లో గౌడ కులానికి చెందిన మహిళను కించపరిచే విధంగా చూపించారు అంటూ ఆ గౌడ సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు మ్యాంగో మీడియా మీద మండిపడ్డారు.

అప్పట్లో ఈ వాదన సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మ్యాంగో మీడియా స్పందించింది. ‘ఈ నెల 24న గౌడ కులానికి చెందినవాళ్ళ మంటూ కొందరు వచ్చారు. ఒక సినిమాలోని వీడియో క్లిప్పింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేసి ఆ సీన్ ను యూట్యూబ్ నుంచి తొలగించమని కోరారు.

స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున ఆ సీన్ ను ఆరోజే డిలీట్ చేశాము. ఇక ఆ వీడియో వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాము’ అంటూ ప్రకటన ద్వారా తెలియ చేసారు.

Exit mobile version