Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పాలి. ఎన్నో వివాదాలు తట్టిలేపి.. వివాదాస్పద డైరెక్టర్ గా ఒక పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈయన చేసే ట్వీట్లు మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య తన సినిమా విషయంలో కూడా అభిరుచులు మొత్తం మారాయి. ఇక తాజాగా మరో ట్వీట్ తో సంచలనం క్రియేట్ చేశాడు.
తాజాగా కోలీవుడ్ నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య తో రిలేషన్ కి బ్రేక్ ఇచ్చినట్టు అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలిపాడు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. నెటిజన్లు మాత్రం కారణం ఏమై ఉంటుందని తెగ చెవులు కొరుకుంటున్నారు. దీంతో వీరిద్దరి విడాకుల విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక ఈ విషయంపై వర్మ స్పందించక ఉంటాడా.. వెంటనే తన స్టైల్ లో స్పందించాడు. పెళ్లి అనేది పెద్ద ప్రమాదం అని యువత గుర్తించడానికి స్టార్ విడాకులు ట్రెండ్ సెట్టర్స్’ అంటూ వర్మ కామెంట్ విసిరాడు. ప్రేమ హత్యకు కారణమే పెళ్లి.. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉండడమే ఆనంద రహస్యం అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు.
Star divorces are good trend setters to warn young people about the dangers of marriages
— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022
పెళ్లి చేసుకున్న రెండు మూడు రోజుల వరకే ప్రేమ ఉంటుంది. స్మార్ట్ పీపుల్స్ ప్రేమిస్తారు. తెలివి తక్కువ వారే పెళ్లి చేసుకుంటారు అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు పెళ్లి గురించి వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్ల తో ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నాడు.