యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘శేఖర్’ చిత్రానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ‘శేఖర్’ చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ కోర్టును ఆశ్రయించాడు. కోర్డు ఆదేశించిన డబ్బు చెల్లించకపోవడంతో ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సాయంత్రంలోపు రూ.65లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు తెలిపింది. నగదు డిపాజిట్ చేయకపోతే శేఖర్ మూవీ అన్ని హక్కులు అటాచ్ చేయాలని ఆదేశించింది. థియేటర్లు, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ యూట్యూబ్‌లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని కోర్టు పేర్కొంది. థియేటర్, ఓటీటీ, శాటిలైట్, యూట్యూబ్ ఎలాంటి చోట్ల ప్రసారాలు చేయ్యొద్దని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై రాజశేఖర్ ట్విట్టర్లో స్పందించారు. “శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు…. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను” అంటూ రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక రాజశేఖర్ శేఖర్ సినిమా మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవిత-రాజశేఖర్ దంపతులు పెద్ద కుమార్తె శివాని ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. మలయాళ జోసెఫ్ తో పోల్చితే శేఖర్ లో చిన్న చిన్న మార్పులు చేశారు.