మనం రోజు టీవీలలో పులి, జింకల పోరాటం చూస్తూనే ఉంటాం. పులి నోట పడకుండా జింక చేసే పోరాటం.. ఆకలితో జింకను వేటడానికి పులి చేసే పోరాటం బాగా హైలెట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ కొండచిలువ కష్టపడి గెలుచుకున్న తన ఆహారాన్ని చేతులారా హైనా కోసం త్యాగం చేసింది. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అది ఒక చిన్న పిల్లజింక. దానిని ఇంపాలా అని అంటారు. ఆ జింక పిల్లకి కొంచెం దూరంలో ఉన్న కొండచిలువకు ఈ జింక పై కన్ను పడింది. అనుకున్న విధంగానే పిల్ల జింకను పట్టేసుకుంది. ఆ చిన్న జింకపిల్ల ఎంతగా దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కుదరలేదు. ఇంతలో ఓ హైనా కు ఆ పట్టుబడ్డ పిల్ల కళ్ళకు విందుగా కనపడింది. జింక తలను పట్టుకుని ఒకసారి లాగడానికి ప్రయత్నించింది.
కానీ కొండచిలువని చూసి బెదిరి పోయింది. ఎందుకంటే కొండచిలువ జింక పిల్లని వదిలేసి దాన్ని ఎక్కడ పట్టుకుంటుందేమో అని బయపడింది. అప్పటికి ఆ హైనా లాగడానికి బాగానే ప్రయత్నించింది. కానీ సాధ్య పడలేదు. మరి కొంత వరకు పోరాడిన కొండచిలువకు ఏమైందో ఏమో చనిపోయిన జింక పిల్లను హైనాకు ఆహారంగా వదిలి వెళ్ళిపోయింది. ఇక హైనా ఇంకా ఎక్కడ ఆగుతుంది దాన్ని తీసుకుని వెళ్లి పోయింది.
కొండచిలువ అక్కడినుంచి చెట్టెక్కి ఆకలి కడుపుతో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల ను తెగ ఆలోచింపజేస్తుంది. యూట్యూబ్ లో ‘లేటెస్ట్ సైటింగ్స్’ అనే పేజీలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన వారు జింక పిల్ల పై బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు మీరూ ఓ లుక్కేయండి.