Site icon 123Nellore

నేను దాని గురించి ఇంకెప్పుడు స్పందించను అంటున్న ప్రియమణి!

Priyamani : టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రియమణి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘పెళ్లయిన కొత్తలో ‘ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ పై పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు షో లలో జడ్జిగా ప్రేక్షకులకు తన గ్లామర్ విందును వడ్డిస్తుంది. ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Priyamani

ఇక ఇటీవల వచ్చిన వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలో ఈ భామ తన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే ప్రియమణి కి తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. “వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కొంటున్న విమర్శలు, వివాదాల నుంచి మీరు ఎలా బయట పడతారు. వాటిని ఎలా అధిగమిస్తారు అన్న ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు ప్రియమణి ”వాటిని ఎలా అధిగమించాలో నాకు బాగా తెలుసు. బయట నా గురించి జరుగుతున్న చర్చ గురించి నేను మాట్లాడి ఇంకా దాన్ని పెద్దది చేయను. అలా చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లే. సో..ఒక చెవితో విని మరో చెవితో వదిలెస్తా” అని ప్రియమణి సమాధానం ఇచ్చింది.

అంతేకాకుండా “ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజుకైనా మనం ఏంటో తెలుస్తుంది. అప్పుడు మన మీద వచ్చిన విమర్శలు కనబడకుండా పోతాయి. దాని గురించి స్పందిస్తే జనాల్లో పదేపదే సానుభూతి ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి ఇంకెప్పుడు స్పందించను” అని కొన్ని విషయాలు తెలియచేసింది ప్రియమణి.

Exit mobile version