Priya Prakash Varrier: టాలీవుడ్ ప్రేక్షకులకు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. కేవలం కనుసైగలతో పాన్ ఇండియా ని ఉర్రూతలూగించింది ఈ భామ. అందులో ఆమె పలికించిన హావభావాలు సోషల్ మీడియా ఎప్పటికీ మరువమనే చెప్పవచ్చు. ఏదైనా ఈ భామ పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఒక హోటల్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం గురించి ఆమె తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది. ‘ఫెర్న్ గొరెగావ్ హోటల్ లో నేను స్టే చేసాను. ఈ హోటల్ పాలసీ ఏమిటంటే.. బయట ఫుడ్ లోపలికి తీసుకొని రానివరు. ఎందుకంటే ఎవరైనా గెస్ట్ లు ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకి ఎక్కువ డబ్బులు వస్తాయి.
నాకు ఈ సంగతి తెలియదు. షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ తీసుకుని హోటల్ కి వచ్చాను. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఇక్కడ హోటల్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలన్నీ కంపెనీ ప్రొడక్షన్ వాళ్ళే చూసుకుంటారు. ఆర్టిస్టులకు ఎటువంటి సంబంధం ఉండదు.
నేను ఎంతో మర్యాదగా వారిని బ్రతిమిలాడుకున్నాను. ఈ ఒక్కసారికి లైట్ తీసుకోండి అని అన్నాను. ఎందుకంటే నేను డబ్బులు పెట్టి కొన్నాను. పైగా దాన్ని పారేయడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్లు అసలు వినిపించుకోలేదు. ఫుడ్ ను బయట వదిలేయాలంటూ పట్టుబట్టారు. నేను చెప్పేది ఏమాత్రం వినిపించుకోలేదు. రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తించారు. దాంతో భోజనం బయట చేయాల్సి వచ్చింది” అన్నీ ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది ఈ భామ.