టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న నారాయణ స్వామి తాజాగా చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టి గెలవాలని సవాల్ విసిరారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఓటు కోసం నాటకాలు ఆడొద్దని అని హెచ్చరించారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడని అన్నారు. ఎన్టీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తే కాంగ్రెస్ తో చంద్రబాబు జతకట్టాడన్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబా, ఎన్టీఆర్ కుమారులా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నాడు, నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త హంగులు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఎన్టీఆర్ పథకాలను అమలు చేయలేదని.., సారాయి వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగండి చూద్దామంటూ సవాల్ విసిరారు.
చంద్రబాబు గతంలో వెయ్యి కాళ్ళ మండపం కొట్టి వేసినప్పుడు ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదని, నేడు సీఎ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెడితే దాన్ని తప్పు అని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం తేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పేదవాడి జీవనం చాలా హాయిగా సాగుతుందన్నారు. జగన్ 15 ఏళ్ల తర్వాత ప్రధాని అవుతారని జోష్యం చెప్పారు. లోకేష్ అనే వ్యక్తి వార్డులో కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు.