Site icon 123Nellore

ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటున్న ప్రగతి!

టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సహాయక పాత్రలు పోషిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాలనటి.. ‘ఏమైంది ఈ వేళ ‘ సినిమాలో హీరో తల్లి పాత్రకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో సినిమాలలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

Actress Pragathi

ఇక ఈమె సోషల్ మీడియా ఇన్ స్టాల్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పోస్టులను అప్డేట్ చేస్తూ.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమాలో సమంత ఆడిన ‘ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ’ సాంగ్ పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ సంపాదించుకుంది.

ఈ స్పెషల్ సాంగ్ లో సమంత చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ మధ్య థియేటర్లలో కుర్రకారుని ఓ ఊపు ఊపింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో భారీ ఎత్తు వ్యూస్ తో దూసుకుపోతుంది. టిక్ టాక్ రీల్స్ పేరుతో నెటిజన్లు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ పాటకు ఓ రేంజ్ లో ఆడుతున్నారు.

ఈ పాట చూశాక ఎన్నో కవర్ సాంగ్ లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా యాక్టర్ ప్రగతి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పాటలో ప్రగతి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

Exit mobile version