Site icon 123Nellore

ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోయేది అప్పుడేనా?

వరుస పాన్‌ ఇండియా సినిమాలతో మస్త్‌ బిజీగా ఉన్నాడు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.  డార్లింగ్‌ చేస్తున్న పాన్‌ ఇండియా సిమాలన్నింటి బడ్జెట్‌ మొత్తం కలిపితే సుమారు రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుందట. ఇంతటి స్టార్‌ రేంజ్‌ ఉన్న ప్రభాస్‌ ఇంకా టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లలో ఒకరిగానే మిగిలిపోయాడు. ఇక ప్రభాస్‌ పెళ్లి మ్యాటర్‌ ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది. పెళ్లి గురించి ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సున్నితంగా దాటవేస్తుంటాడు ప్రభాస్‌.

ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ మాత్రం ప్రభాస్‌ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 42 ఏళ్లు ఉన్న ప్రభాస్‌ ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ చెబుతున్నారు. ‘హీరో ప్రభాస్‌ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబర్‌ 2022 నుంచి అక్టోబర్‌ 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. మోస్ట్‌ హ్యాండ్సమ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో ఇది నా జ్యోతిష్యం.’ అని ఆయన తెలిపారు.  మరి ఆయన చెప్పింది జరుగుద్దో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

ఇక ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయన హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. వీటితో పాటు ప్రభాస్‌ ‘సలార్‌’, ‘ఆది పురుష్‌’, ‘ప్రాజెక్టు కె’ చిత్రాలతో పాటు మరో చిన్న సినిమాలోనూ నటించనున్నారు.

Exit mobile version