Site icon 123Nellore

గర్భవతి అయిన ఆరెంజ్​.. ఎలాగంటే?

సామాజిక మాధ్యమాల్లో రోజుకు వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో యూజర్లు కేవలం వైరల్​ వీడియోలను వెతికి మరీ పట్టుకుని పోస్ట్ చేస్తుంటారు. ఇలా ఓ యూజర్​ పోస్ట్ చేసిన ఆరెంజ్​ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది. వీడియో లో ఉండే విశేషం ఏమిటంటే.. ఓ ఆరెంజ్​ ప్రెగ్నెంట్​ అయ్యింది. పొట్ట విప్పి చూస్తే సుమారు 10 చిన్న ఆరెంజ్లు ఉన్నాయి. ఈ వీడియో సోషల్​ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే చాలా మంది చూశారు. అంతేగాకుండా వారు మరి కొందరికి షేర్ చేశారు. ఇలా వైరల్ అవుతుంది.

People of Netpara find ‘pregnant orange’! 6-8 more inside one Bizarre Orange Video Goes Viral

అయితే ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇది సాధ్యం అయ్యింది అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది ఎవరో కావాలని చేసి ఉంటారు అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇలాంటిది సాధ్యం అవ్వదు కదా అంటున్నారు. దీని వెనుక ఉండే మతలబు ఏంటో కూడా షేర్​ చేసుకోవాలి అని చెప్తున్నారు.

ఓ నారింజ పండును ఒలిస్తే సాధారణంగా అందులో బద్దలు బద్దలుగా ఉండే రసంతో కూడినవి రావాలి. కానీ ఈ వీడియోలో మాత్రం అందుకు భిన్నంగా3 జరిగింది. ఓ వ్యక్తి కేవలం తొక్క ఒలవగానే సుమారు పది ఆరెంజ్​ లు బయటపడ్డాయి. దీంతో ఒలిచిన వ్యక్తే ఏకంగా కంగుతిన్నాడు. ఇలా వింతగా ఉన్న వీడియోను చూసిన చాలా మంది ఇదేంది అయ్యా ఇది అని అంటున్నారు. నారింజ ప్రెగ్నెంట్​ కావడం ఏంటి అని అవాక్కవుతున్నారు.

Exit mobile version