Site icon 123Nellore

జగన్ ను ఇంటికి పంపాలన్న ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది : చంద్రబాబు

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారని, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సభలో చంద్రాబాబు మాట్లాడుతూ..’’ ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవటమే కాదు, టైర్లలో గాలి తీశారు. టీడీపీ వెంట ప్రజలు ఉన్నారు, వైసీపీ వెంట బస్సులు ఉన్నాయి. అదుపుతప్పితే పోలీసులనూ నియంత్రించే శక్తి తెలుగు సైన్యానికి ఉంది. వైసీపీ సమావేశాలు వెలవెల.. టీడీపీ సమావేశాలు కళకళ.

అన్ని జిల్లాల్లో మినీ మహానాడును నిర్వహిస్తాం . బాలకృష్ణ సినిమాపై జగన్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అడ్డంకులను అధిగమించి అఖండ సినిమా విజయం సాధించింది. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్ చూస్తున్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడపగడపకు ప్రభుత్వం అని నిర్వహించారు. గడపగడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. గడపగడపకు కార్యక్రమాన్ని రద్దు చేసి బస్సు యాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే మరో శ్రీలంక కానుంది. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను.

నేను అడ్డుకుంటే జగన్ పాదయాత్రలు చేసేవారా?. నేను ప్రజాస్వామ్య వాదిని కాబట్టే అడ్డుకోలేదు. ఇప్పుడు రాజకీయ రౌడీలు, గూండాలు వచ్చారు. రాజకీయ రౌడీలు, గూండాలు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను. వైసీపీవి మోసకారి సంక్షేమ కార్యక్రమాలు. నిజమైన సంక్షేమం అంటే టీడీపీ పథకాలే. సంక్షేమ పథకాల పేరిట లక్షల కోట్లు దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసింది. రూ.8 లక్షల కోట్ల అప్పును జగన్ చెల్లిస్తారా?. జగన్ చేసిన అప్పుల కోసం ప్రజలను బాదుడే బాదుడు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కల్తీ మద్యం, నాటుసారా తాగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.

Exit mobile version