చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడినదానికి పేర్ని కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తీగలాంటి పవన్ కు ఊతకర్రలా చింజీవి నిలబడ్డారని తెలిపారు. అందరికీ నమస్కారం పెట్టిన పవన్ చిరంజీవిని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడంతోనే పవన్ సంస్కారం బయట పడుతోందని మండిపడ్డారు.
టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నారని, పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి వస్తారని టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశం ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నించారని, ఆనాడు అమరావతి కుల రాజధాని అన్న మాటలు గుర్తు లేదా? అని నిలదీశారు. పవన్ ది పూటకో మాట, రోజుకో సిద్ధాంతమన్నారు. పవన్ మాత్రం ఏమైనా అనొచ్చు..పవన్ ను మాత్రం అంటే మానసిక అత్యాచారమా? అని సెటైర్లు వేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా, విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగలేరా అని ప్రశ్నించారు. శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా పట్టుకుని అడగలేరా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం గురించి బీజేపీని నిలదీయలేరా అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని నిలదీయలేరా? అని అడిగారు. పవన్ కల్యాణ్ రాజకీయ ఊసరవెల్లి అని, – కంఠం పవన్ ది.. భావం చంద్రబాబుదని