Site icon 123Nellore

‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్‌ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..!

ఇప్పుడు ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులకు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్.. పవన్ , రానా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది.

ఈ సినిమా సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. విడుదలైన మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్‏లో చేరిపోయింది. ఇండియాలోనే కాకుండా.. అమెరికాలో భీమ్లా నాయక్ సినిమా దాదాపు రూ. 14.95 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా నైజాం ఏరియాలోనూ భీమ్లా నాయక్ మేనియా కనిపిస్తోంది.

భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ పెర్ఫార్మన్స్‌తో ఇరగదీశారు. పవన్ సరసన నిత్యామీన‌న్‌, రానా సరసన సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.

Exit mobile version