Site icon 123Nellore

పవన్ తాడిపత్రికి రావాలి..తన ఎమ్మెల్యేలనే జగన్ తిట్టారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

పవన్‍కల్యాణ్ రైతులకు సాయం చేసేందుకు వస్తే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.  తాడిపత్రిలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి చేస్తామని అధికారంలోకి వచ్చారని అన్నారు. తిరుమల వెళ్లే భక్తులకు ఇన్ని అవస్థలా అని ఆవేదన వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి వచ్చాక దైవ దర్శంన కరువైందన్నారు. ఇంట్లో ఉండి మొక్కుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ వస్తే కానీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. తాడిపత్రికి రావాలని పవన్‍ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. పవన్ వస్తే రాజకీయాలకు అతీతంగా తానే తిప్పుతానన్నారు. వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలనేనన్నారు. తాను ఇచ్చిన వారే మంత్రులు.. మిగతావారు నా వెంట్రుక కూడా పీకలేరని జగన్ అన్నారని తెలిపారు. విద్యా దీవెన కార్యక్రమంలో జ‌గ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చినంత‌నే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నో, మ‌రొక‌రినో ఉద్దేశించి అన్నార‌ని అంతా అనుకున్నార‌ని వ్యాఖ్యానించారు.

అయితే ఇటీవల జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం విద్యార్ధులకు చిక్కి అందిస్తుందని, అయితే చిక్కి విద్యార్ధుల చేతికి అంటకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం కవర్ చుట్టి అందిస్తున్నామన్నారు. ఈ చిక్కీపై జగన్ ఫోటో ఉందని చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  ఈ సందర్భంగా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఉన్నంత కాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

Exit mobile version