Site icon 123Nellore

కల్లు చెదిరేలా పవన్ వాహన శ్రేణి

పార్ట్ టైం పాలిటిక్స్ నుండి బయటపడేందకు జనసేన అధనేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తం పర్యటన కోసం రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. అక్టోబర్ 5 నుండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉంటుందని జనసేన స్టీరింగ్ కమిటీ  ఇందుకోసం 8 స్కార్పియో కార్లతో తన వాహణశ్రేణిని సిద్ధం చేసుకున్నారు. ఈ 8 కార్లు ఆదివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చాయి. ఇప్పుడు ఈ వాహనాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన పూర్తి సమయాన్ని ఇక రాజకీయాలకు ఉపయోగించాలన్న యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన పవన్ ఈ సారి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుకే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. తిరుపతి నుండి యాత్ర ప్రారంభిస్తారని తెలియడంతో అక్కడి నుండే పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే పవన్ పర్యటనకు బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చిందా లేదా అన్న సందేహం  కలుగుతోంది. బీజేపీ-జనసేన మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. బీజేపీపై జనసేన నేత శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో సంబంధం లేకుండా సొంతంగానే పవన్ కార్యాచరణ ఉందని, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నట్లా.. లేనట్లా? అని ఆయన ప్రశ్నించారు. జనసేన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బీజేపీ పట్టించుకోలేదని, బీజేపీతో జనసేనకు పొత్తు లేదని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు వల్ల జనసేన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు దూరమవుతోందని, బీజేపీ చేసే పనులకు జనసేన మూల్యం చెల్లించుకుంటోందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు పరిశీలించిన విశ్లేషకులు జనసేనకు బీజేపీతో స్నేహం కట్ అయిందని చెప్తున్నారు.

 

Exit mobile version