Site icon 123Nellore

తల్లిలాంటిదాన్ని పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారు : కొడాలి

భీమ్లానాయక్ సినిమాకు కొత్తగా షరతులు ఏమీ పెట్టలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలని స్పష్టం చేశారు.  తల్లిలాంటి సినిమాను పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్ప, అఖండ సినిమాలకు కూడా ప్రస్తుత నిబంధనల ఉన్నాయని వివరించారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటేనన్నారు.  సినిమాకో నిబంధనలు విధించే ప్రభుత్వం తమది కాదని, సీఎం జగన్ ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అని ఉద్ఘాటించారు. బ్లాక్ టికెట్ల పేరుతో దోచుకుందామనుకుంటే కుదరదని హెచ్చరించారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా జగన్ పై విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

టికెట్ ధరలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మీకు మీరుగా విడుదల చేసుకుని ప్రభుత్వంపై నిందలా? అని ప్రశ్నించారు. చిరంజీవిని సీఎం జగన్ ఎంతో గౌరవిస్తారని,  పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం చిరంజీవిని ఆహ్వానించారని గుర్తు చేశారు. క్యాంపు ఆఫీసులోకి ఇతర వాహనాలు వెళ్లవని, జగన్ దగ్గర చిరంజీవి విన్నపాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్ కళ్యాణ్ ని కోరుతున్నాని తెలిపారు.

సీపీఐ నారాయణ పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని, సీఎం జగన్ శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించకుండా రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తారన్నారు. సీఎం జగన్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ప్రజల ఆశీస్సులతో 2024 లోనూ జగన్ సీఎం అవుతారని, వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. బాబు ఉచ్చులో పడి చిరంజీవిని అవమానించొద్దని పవన్ కు చెబుతున్నానని వివరించారు. భారతి సిమెంట్ పై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని, హెరిటేజ్ గురించి చర్చించేందుకు మీరు సిద్ధమా? సవాల్ చేశారు.

Exit mobile version