Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరుకి ప్రత్యకంగా పరిచయాలు అవసరం లేదనే చెప్పాలి. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. పవర్ స్టార్ సినిమా రిలీజ్ కి ఆయన అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సాధారణ జనం నుంచిన్ సినీ ప్రముఖుల వరకు పవర్ స్టార్ కు అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని పెళ్లి సమయం చేసిన ఓ పని సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడు అని అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరీ చదవక తప్పదు.
సాధారణంగా పెళ్లి కార్డు పై దేవుడి ఫోటోలను ముద్రించడం చూస్తూ ఉంటాం. అయితే పవన్ వీరాభిమాని శుభలేఖపై దేవుడి ఫొటో ఉండాల్సిన చోట పవన్ ఫొటోను ముద్రించాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామానికి చెందిన తమ్మినేని శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఈ డిసెంబర్ 18న ఆయన పెళ్లి కుదిరింది. తన జీవితంలో జరగుతున్న శుభకార్యంలో ఈ అభిమాని పవన్ కళ్యాణ్ ఫొటోను ముద్రించుకున్నారు. అంతేకాక తన పెళ్లికి హజరై ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్‌కు ఇన్విటేషన్ సైతం పంపాడు. దీంతో పవన్ అభిమానులంతా అతన్ని పొగుడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇలా అభిమానులు పలు సందర్భాలలో పవన్‌పై అభిమానం ప్రదర్శిస్తుంటారు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది. ఈ మూవీ కోసం పవర్ స్టార్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.