Site icon 123Nellore

వైరల్‌ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటోస్.. RRR పాటతో అదరగొట్టిన అఖిరా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనంటే అభిమానులకు ప్రాణం. ఇక ఆయన తన వారసుడు అకీరా నందన్‌ను కలిశాడంటే చాలు.. అభిమానుల తెగ మురిసిపోతుంటారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల వల్ల కొడుకు అకిరా, కూతురు ఆద్యలు తల్లి రేణు దేశాయ్‌తోనే ఉంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు వారిని కలుస్తూనే ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో పవన్ పిల్లలతోనే గడుపుతుంటారు. తాజాగా అకీరా స్కూల్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తన పిల్లలు, రేణ దేశాయ్‌తో కలిసి ఫొటో తీసుకున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan attends son Akira Nandan’s graduation ceremony

ఇక అకీరా మల్టీటాలెంటెడ్. కేవలం చదువులోనే కాకుండా.. సంగీతంలో, ఆటలలో మంచి పట్టు సాధించాడు.. ముఖ్యంగా పియానో వాయించడంలో అకీరా దిట్ట అన్న సంగతి తెలిసిందే. గతంలో అకీరా ఇంట్లో పియానో వాయిస్తున్న వీడియోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూనే వస్తుంది. అకీరా మల్టీటాలెంట్స్ చూసి పవన్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతుంటారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు తన స్నేహితుల కోసం అద్భుతంగా పియానో వాయించాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన స్కూల్ గ్రాడ్యూయేషన్ డేలో స్కూల్ స్నేహితుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు పియానోను అద్భుతంగా వాయించాడు.. అకీరా పియానో వాయిస్తున్న వీడియోను రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. “తన స్కూల్ స్నేహితుల కోసం ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ పాటకు పియానో వాయించాడు అకీరా.. 15 సంవత్సరాల పాఠశాల జీవితం పూర్తైంది.. (నర్సరీ నుంచి ప్లస్ 2 వరకు).. ఇప్పుడు తనకు కాలేజ్ సమయం ప్రారంభమైంది. చాలా త్వరగా ఎదిగిపోయాడు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు రేణు దేశాయ్.

Exit mobile version