ఇంటి ఆవరణలో కొంచెం విశాలమైన ప్రదేశం ఉన్నా పెంచుకోగలిగే మొక్కల్లో బొప్పాయి కూడా ఒకటి. ఇక పల్లెటూరిలో అయితే బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. విటమిన్ సి గుణాలు బాగా కలిగిన బొప్పాయి మంచి మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్, న్యూట్రింట్స్, విటమిన్స్ కలిగి ఉంటుంది.ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని ఆకులు కూడా జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు. అయితే బొప్పాయిని మాత్రం ఈ సమస్యలు ఉన్నవారు అతిగా తినకూడదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం…
బొప్పాయి అధికంగా తింటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే. కాని మరీ తక్కువగా ఉండటం మంచిది కాదు. తక్కువ షుగర్ లెవల్స్ తో కొందరు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి.
చర్మ సంబంధిత సమస్యలు అయిన తెల్ల, పసుపు మచ్చాలకి బొప్పాయి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ సమస్య ఉంటే అస్సలు బొప్పాయిని ముట్టుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆస్తమా, హై ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజీం ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటి సమస్యలను ఇంకా పెంచుతుంది.
గర్భిని స్త్రీలు కూడా బొప్పాయికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే దీంట్లో లటేక్స్ యుతెరైన్ కాంట్రాక్షన్ కి కారణం అవుతుంది. దీనివలన కడుపులో బిడ్డకి ప్రమాదం.
బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ సి ఉండటం వలన రెనాల్ స్టోన్స్ సమస్య వస్తుంది. అలాగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.