అందానికి ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. అది అమ్మాయిలైనా..అబ్బాయిలైనా. అందాన్ని కాపాడుకోవడానికి వయసుతోనూ సంబంధం లేదు. ఉన్న అందాన్ని కాపాడుకోవడానికి, పోయిన అందాన్ని తిరిగి సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ అందాన్ని కాపాడటానికి బాదంపాలు కూడా సాయపడతాయి. అది ఎలాసాధ్యమంటే.. ప్రతిరోజూ పొద్దున్నే ఒక గ్లాసు నీటిలో ఆరు బాదం గింజలు వేసి సాయంత్రం వరకు బాగా నానబెట్టాలి. తర్వాత నీరు తీసిన తర్వాత పప్పులపై ఉండే పొక్కు(తోలు)ను తీసి వాటిని బాగా దంచి గ్లాసు పాలల్లో వేసుకోవాలి.
వీటితో పాటు నాలుగు నల్ల మిరియాలు, ఒక టీ స్పూన్ సొంపు గింజల పొడిని కూడా వేసుకుని మూడు పొంగులు వచ్చే వరకు సన్నటి మంటతో మరిగించాలి. అనంతరం వాటిని ఒక గ్రాస్ లోకి తీసుకుని వడపోసుకుని తగినంత చక్కెర కలిపి ప్రతి రోజూ సాయంత్రం, లేదా నిద్రపోయే ముందు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత మీ ముఖంలో మార్పులు ఖచ్చితంగా కనబడతాయి. బాదం పప్పు చూడటానికి మన కంటి ఆకారంలో ఉంటాయి. భగతవంతులు కళ్లను కాపాడుకోవాడానికి ఈ బాదం పప్పును సృష్టించారని సులువుగా తెలుసుకోవచ్చు.
ఈ విధంగా రోజూ బాదంపప్పును వాడటం వల్ల కంటి నరాలకు అద్భుతమైన దృఢత్వం కలుగుతుంది. కంటి మసకలు కూడా నియంత్రించబడతాయి. పిల్లలు, పెద్దల మెదడుకు కూడా అపారమైన శక్తిని పెంచుతుంది. జ్ణాపకశక్తిని కూడా బాదం పప్పు పెంచుతుంది. కీళ్ల నొప్పులు, అరిగిపోయిన కీళ్లు తిరిగి మరళా బాగుపడి మంచి నడక కూడా బాదం పప్పు వల్ల వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ అందాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి బాదం పప్పును తినండి.