Site icon 123Nellore

తప్పని నిలదీసినందుకు తెదేపా కార్యకర్తపై పెట్రోల్​తో దాడి

ఏపీలో రాజకీయ గొడవలు రోజు రోజుకూ చెలరేగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరులో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. తాజాగా, తెదేపా కార్యకర్తపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన అత్తగారింటి నుంచి తిరిగొస్తుండగా.. ప్రత్యర్థులు కాపు కాసి మరి దాడికి యత్నించారు. అనంతరం పెట్రో పోసి నిప్పంటించారు. ప్రస్తుతం ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు వెంకటరమణ. చంద్రబాబుపై వివాదాస్పదన వ్యాఖ్యలు చేసినందుకు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను నిలదీసిన నేపథ్యంలో.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. స్థాయనికుల సమాచారంతో గాయపడిన వెంకటరమణమను ఆసుపత్రికి తలరించారు. అప్పటికే 40శాతం కాలిపోయారు వెంకటరమణ. ముఖం, చేతులు, ఛాతి భాగంలో ఎక్కువ గాయాలయ్యాయి. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పందించారు. జగన్ పుట్టి రోజు నాడు వైకాపా కార్యకర్తలు చంద్రబాబును తిట్టారని.. దాన్ని ప్రశ్నిస్తే ఇలా రౌడీఇజం చేసి మద్య సీసాలతో నారాయణను విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపించారు. తప్పు చేయొద్దని చెప్పినందుకు కూడా చంపేస్తారా?.. అని ప్రశ్నించారు. తమను ప్రశ్నించే వారు లేరనే ధైర్యంతోనే వైకాపా ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ టాపిక్​ రాజకీయంగా హాట్​ టాపిక్ గా మారింది. ఇలాంటి ఘటనలు ఇదే కొత్త కాదు. గతంలోనే ఇలాంటివి చాలా జరిగాయి.

Exit mobile version