Site icon 123Nellore

ఒకరిద్దరు తప్ప అంతా అవుట్..

ఏపీ కేబినెట్ పూర్తిగా పునర్‍వ్యవస్థీకరణ జరగనుంది. ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే చాన్స్ లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న పునర్‍వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు సీఎం జగన్ సమూల మార్పులు చేస్తున్నారు. కొత్త జిల్లాలతో కలిపి జిల్లాకో మంత్రి చొప్పున అవకాశం ఇవ్వనున్నారు. ఐదు డిప్యూటీ సీఎం హోదాలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావుకు చాన్స్ లభించే అవకాశం ఉంది. తూ.గో జిల్లా నుంచి పొన్నాడ సతీష్, కొడాలి స్థానంలో వసంత కృష్ణప్రసాద్ ఖరారయ్యే చాన్స్ ఉంది. పేర్నినాని ప్లేస్‍లో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి స్థానంలో కొలగట్ల లేదా అన్నెరాంబాబు, కృష్ణా జిల్లా నుంచి రేసులో పార్థసారథి, జోగి రమేష్ ఉన్నారు.

గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, విడుదల రజిని, మేరుగ నాగార్జున రేసులో ఉన్నారు. ప్రకాశం నుండి ఆదిమూలపు సురేష్ స్థానం సుధాకర్‍బాబుకు దక్కే అవకాశం కనబడుతోంది. నెల్లూరు నుంచి కాకాని, మేకపాటి కుటుంబసభ్యుల్లో ఒకరికి మంత్రి పదవి వరించనుంది. చిత్తూరు నుంచి రోజా, భూమన, మధుసూదన్‍రెడ్డికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కర్నూలు నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని, కంగాటి శ్రీదేవి ఉన్నారు.

అనంతపురం నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉషా చరణశ్రీ, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కడప నుంచి శ్రీకాంత్‍రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, డా.సుధ పేర్లను అంచనా వేస్తున్నారు. అంజాద్‍బాషా స్థానం హఫీజ్‍ఖాన్‍కు చాన్స్ దక్కేలా ఉంది. బొత్స సత్యనారాయణ స్థానంలో కొలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పుష్పశ్రీ వాణి ప్లేస్‍లో రాజన్నదొర, భాగ్యలక్ష్మి, అరకు ఫల్గుణ, పోలవరం బాలరాజు, అవంతి స్థానం గుడివాడ అమర్నాథ్‍కు దక్కే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version