సినిమాలలో లాటరీ కట్టడం అదృష్టం బావుండి వాటిని గెలుచుకోవడం లాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా నిజ జీవితంలో కూడా లాటరీలు కట్టి అదృష్టం బాగుండి ఒక్కసారిగా కుబేరులు అవుతూ ఉంటారు. ఇదే తరుణంలో అమెరికాలో ఓ మహిళ కూడా అక్షరాల 22 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టింది. ఇప్పుడు ఆ మహిళ నెటిజన్లను ఆశ్చర్యపరుచుతుంది.
ఆ లక్కీ ఉమెన్ పేరు లారా స్పియర్స్. ఆమె వయసు 55 ఏళ్లు. అమెరికాలోని ఆక్లాండ్ లో నివాసం ఉంటుంది. ఈమె డిసెంబర్ 31 న ఓ టికెట్ కొనుగోలు చేసింది. దానికి ఫలితంగా అక్షరాల రూ.22,32,61,350 రూపాయలు గెలుచుకుంది. అసలు ఆమె కొనుగోలు చేసిన లాటరీ ఖరీదు $2. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 148 రూపాయలు. కాబట్టి ఆమె 3డాలార్ల తో అక్షరాల 22 కోట్ల గెలుచుకుంది.
ఇందులో విచిత్రమేమిటంటే.. లాటరీ టికెట్ కొన్న తర్వాత ఆమె ఆ టికెట్ గురించి పూర్తిగా మరిచిపోయింది. ఆమె పనిలో ఆమె మునిగిపోయింది. ఇక రోజూలాగే ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటు ఉండగా ఆ సమయంలో స్పామ్ ఫోల్డర్ చూస్తే మెగా మిలియన్ జాక్ పాట్ ఈమెయిల్ కనిపించింది. ఇక ఆమెకు ఇదివరకు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ గుర్తుకొచ్చింది.
Laura Spears got the surprise of a lifetime when she checked her spam folder and realized she'd won a $3 million Mega Millions prize! ➡️ https://t.co/ZmCSxPDQR8 pic.twitter.com/HjFeLrL8kR
— Michigan Lottery (@MILottery) January 21, 2022
స్పామ్ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే.. ఒక్క సారిగా ఆమె ఆనందం ఆకాశాన్ని అంటింది. ఆమెకు వచ్చిన మెయిల్ జాక్ పాట్ నిజమా.. కాదా అని క్లియర్ చేసుకుంది. ఇక ఆమె జనవరి 20న లాటరీ సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆమె డబ్బులు కలెక్ట్ చేసుకుంది.