Site icon 123Nellore

నా కోసం కాదు..రాష్ట్రం కోసం కలసిరండి : చంద్రబాబు

రాష్ట్రాన్ని బాదుడు ప్రభుత్వం పాలిస్తోందని, నాడు ముద్దులు..ఇప్పుడు గుద్దులు…ఇదే జగన్ పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నిత్యావసర సరుకులు ధరలు భరించలేని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వంపై పోరాడాలని, .నాకోసం కాదు..రాష్ట్రం కోసం అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆముదాలవలసలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలన తోనే అరిష్టం అని, కరోనా కంటే జగన్ పాలనే ప్రమాదకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క చాన్స్ అని అడిగాడు…ప్రజలంతా మాయలో పాడ్డారని, ఇప్పుడు అదే చివరి ఛాన్స్ కావాలన్నారు.

151 గెలిచాను అని జగన్ కు మదం ఎక్కిందని, మా ఇంటిపై దాడి చేశారు…టీడీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారని మండి పడ్డారు. తిడితే భయపడం… ఖబద్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.  జగన్ ను శాస్వితంగా రాజకీయాల నుంచి దూరం చేస్తామని, తమను వేధించిన వాళ్లను కమిటీ వేసి అందరి సంగతి చూస్తామన్నారు. వంట నూనె, గోధుమ పిండి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయని, గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉంటుందా అని అక్కడి ప్రజలను అడిగారు. ఈ నెల విద్యుత్ చార్జీలు బిల్లులు మరింత బాదుడే బాదుడు అని, గుండె ఆగిపోయే స్థాయి కరెంట్ బిల్లులు వస్తాయన్నారు.

కేంద్రం చెప్పినా పెట్రోల్ పై జగన్ ఒక్క రూపాయి తగ్గించడం లేదని, టీడీపీ హయాంలో పెట్రోల్ పై రూ.5 రూపాయలు తగ్గించామని, చెత్త పై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. ఏపీ లో ఉండే మద్యం బ్రాండ్స్ ఎక్కడా ఉండవు. నాణ్యత లేని మద్యం తో ప్రజల ఆరోగ్యాలు గుల్ల అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఖర్చు 1000 రూపాయలు దాటితే మొత్తం ఆరోగ్య శ్రీలో ఇస్తానన్నాడు… మాట తప్పాడని మండిపడ్డారు. నేడు రెండో రోజు బీమిలిలోని తాళ్లవలసలో బాదుడే బాదుడు కార్యక్రమాన్నినిర్వహించనున్నారు.

 

Exit mobile version