message in bottle: ఈ మధ్యకాలంలో చాలా వరకూ కొన్ని స్టోరీలు రీల్ లోనే కాకుండా రియల్ గా కూడా జరుగుతున్నాయి. ఇలా జరిగిన స్టోరీ లు ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. మరి ఇదే నేపథ్యంలో ఒక కొత్త స్టోరీ పేస్ బుక్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం.
2020 సంవత్సరంలో ‘ఎలెనా అండ్రెస్సెన్ హాగా’ తన కొడుకుతో కలిసి సముద్రంపై పడవలో వెళ్లారు. ఆ క్రమంలో వారికి నీటిలో సీసా కనపడింది. దాన్ని చూసి వాళ్ళు లిక్కర్ బాటిల్ అనుకున్నారు. ఆ బాటిల్ లో ఎదో లెటర్ చుట్టి ఉంది. ఆ బాటిల్ తెరిచి చూడగా వారికి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.
25 సంవత్సరాల క్రితం 8 ఏళ్ల వయసు ఉన్న జొహన్నా బుచాన్ స్కాంట్లాండ్ సముద్రంలో ఆ మందు బాటిల్ పడేసింది. ఇప్పుడు ఆమెకు 34 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటుంది. వృత్తిపరంగా ఆమె డాక్టర్. స్కూల్ పిక్నిక్ భాగంగా సముద్రతీరానికి వెళ్లిన జో హాన్నా ఒక లెటర్ లో మెసేజ్ రాసి బాటిల్ లో పెట్టి సముద్రంలో వేసింది.
ఆ బాటిల్ దొరికిన ఎలెనా, ఎలాగైనా జోహాన్న ను కనిపెట్టాలి అని అనుకుంది. జోహాన్న జాడను పేస్ బుక్ లో కనిపెట్టింది. జరిగిన దాని గురించి మెసేజ్ పెట్టిందట. ఇక జోహన్న కూడా ఆ మెసేజ్ కు రిప్లై ఇచ్చింది అంటూ.. ఎలినా తెలిపింది.