Site icon 123Nellore

ఎవర్నీ బుజ్జగించాల్సిన అవసరం లేదు : సజ్జల

కేబినెట్‍ విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని, రేపు మధ్యాహ్నం వరకు ఈ కసరత్తు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని కాంబినేషన్స్ ను సీఎం వర్కవుట్ చేస్తున్నారని పేర్కొన్నారు. లాస్ట్ మినిట్ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. లిస్ట్ ఫైనల్ అయ్యాక కాబోయే మంత్రులకు రేపు ఫోన్లు చేస్తారని పేర్కొన్నారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని, బీసీలకు ప్రాధాన్యత ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. రేపు మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల జాబితా సిద్ధమవతుందన్నారు.

మహిళలకు సముచిత స్థానం ఉంటుందని, పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని అన్నారు. అయితే ఇదిలా ఉండగా కేబినెట్‍లో బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి నానిలకు బెర్త్ ఖరారు అన్న టాక్ నడుస్తోంది. ఆదిమూలపు సురేష్, వేణుగోపాల్, సిదిరి అప్పలరాజు, శంకరనారాయణ, తానేటి వనిత, గుమ్మనూరు జయరాం కొనసాగింపునకు గ్రీన్‍సిగ్నల్ లభించిందని సమాచారం. పేర్నినాని, బాలినేనిలకు రెడ్ సిగ్నల్ పడిందని గుసగుసలు వినబడుతున్నాయి. 15 మందికే కొత్త మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

రేపు మధ్యాహ్నం సీల్డ్ కవర్‍లో మంత్రుల జాబితాను పంపే అవకాశం ఉంది. కొత్త మంత్రులకు అధికారికంగా లేఖలు అందనున్నాయి. మంత్రుల పూర్తి జాబితాపై సస్పెన్స్ రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మంత్రులను మారుస్తానని జగన్ ముందే చెప్పారని కొడాలి నాని పేర్కొన్నారు. కేబినెట్ అవినీతిమయమని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని, 2019లోనే జగన్ నిర్ణయం తీసుకున్నారుని, 80 శాతం మార్పులుంటాయని గతంలోనే చెప్పారన్నారు. ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం కాదని కొడాలి నాని అన్నారు. అయితే స్టీల్డ్ కవర్లో ఎవరి పేర్లు ఉంటాయోనని ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది.

Exit mobile version