Site icon 123Nellore

ఏపీలో కరెంటు లేదు..40 బస్సుల్లో వచ్చి చూడండి..!

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సొంతూళ్లకెళ్లిన తమ ఫ్రెండ్స్‌ చెప్పారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందంటున్నారని తెలిపారు. బెంగుళూరు కంపెనీలు కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిపై మండిపడుతున్నరని అన్నారు.  తెలంగాణ ప్రశాంతమైన రాష్ట్రం అని, దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఏపీ గురించే కేటీఆర్ మాట్లాడి ఉంటే ఖండిస్తున్నామని రోజా అన్నారు. తమ రాష్ట్రం వచ్చి చూడాల్సిందిగా కేటీఆర్‍ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తామని, ఏపీలో సచివాలయాలు చూసి తమిళనాడులో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.  ఏపీలో సచివాలయాలను కేటీఆర్‍కు చూపిస్తామన్నారు.  దేశంలో మిగతా రాష్ట్రాల కంటే.. ఏపీని జగన్ ఎలా పాలిస్తున్నారో చూపిస్తామన్నారు. తెలంగాణలోనూ విద్యుత్ కోతలున్నాయని, విద్యుత్ సమస్య దేశ వ్యాప్తంగా ఉందని సజ్జల అన్నారు. ఇక బొత్స స్పందిస్తూ.. ఏపీ గురించి కేటీఆర్‍కు ఎవరో స్నేహితుడు ఫోన్ చేశాడేమోనని,  తాను నిన్నటి వరకు హైదరాబాద్‍లోనే ఉన్నానన్నారు.

కరెంట్ లేక జనరేటర్ మీద ఉండాల్సి వచ్చిందని, ఇది తానెవరితోనూ చెప్పలేదు కదా ప్రకటించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి 40 బస్సుల్లో వచ్చి చూడాలని మంత్రి అప్పల రాజు అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ అన్నారని, ఏపీలో విద్యుత్ కోతలు ఉన్నది వాస్తవేమనన్నారు. లోకేష్ ఏకంగా కేటీఆర్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Exit mobile version