Site icon 123Nellore

అనుమానంతో భార్యను కిరాతకంగా చంపి తాళం వేసుకొని పారిపోయిన భర్త.. ఎక్కడంటే?

సాధారణంగా కొందరు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో మరణిస్తే మరికొందరు అనుమానం కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ చివరికి హత్య చేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ అనుమానం పేరుతో ఎన్నో నేరాలు చేశారు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.కేవలం భార్యపై ఉన్న అనుమానంతో ఆమె పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించిన భర్త ఆమెను దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశా రాష్ట్రం రంప గ్రామానికి చెందిన పుణ్యవతి అలియాస్ భవాని శిరీష అనే యువతిని శ్రీకాకుళం జిల్లా
జిల్లా హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో ఈ ఏడాది మేలో వివాహం జరిగింది.పెళ్లి సమయంలో శిరీషకు తన తల్లిదండ్రులు మూడు లక్షల విలువ చేసే బంగారు నగలు మరికొన్ని వస్తువులను కానుకగా ఇచ్చారు. పెళ్లి తర్వాత ఈ జంట హైదరాబాద్లో కాపురం ఉన్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి తన భార్య సిరీష పై సంతోష్ నిత్యం తనని ప్రశ్నించేవాడు.

ఈ క్రమంలోనే పెళ్లయిన ఆరు నెలల కాలంలో నాలుగు ఇళ్లు మారి తనని ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేసే వాడు. ఇలా సంతోష్ తనని మానసికంగా వేధించడంతో భరించలేని శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన తన పద్ధతి ఏమాత్రం మార్చుకోకుండా సంతోష్ శిరీష పై అనుమానపడుతూ తన వ్యక్తిత్వాన్ని అవమానించాడు.ఇలా వీరిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో ఏకంగా శిరీషను ముక్కలు ముక్కలుగా నరికి ఇంటికి తాళం వేసుకొని సంతోష్ పారిపోయిన ఘటన హైదరాబాద్లోని మూసాపేటలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version