ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఫోటోగ్రాఫర్లు సైతం పెళ్లి వీడియోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఓ వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ దానిలో ఏం ఉంది అని అనుకుంటున్నారా… అక్కడే దాగుంది అసలు ట్విస్టు..!
ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిల్లలో ఫన్ కోసం చాలా మంది చాలా చాలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెళ్లి తరువాత జరుగుతున్న తంతును కెమెరామ్యాన్లు బాగా క్యాప్చర్ చేసి పబ్లిసిటీ స్టంట్ కింద వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు కింద చూడబోయో వీడియో ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోల కంటే చాలా డిఫరెంట్గా ఉంది. అందులో ఏం ఉందో ఇప్పుడు చూద్దాం.
మనం చూస్తున్న వీడియో ప్రకారం.. పెళ్లి బట్టలల్లో ఉన్న వధూ వరులు ఒకరిని పట్టుకుని ఒకరు పరుగులు పెడుతున్నారు. అది కూడా నార్మల్ రోడ్డు మీద కాదు. మట్టి రోడ్డు మీద. ఒక పక్క దుమ్ము, మరో పక్క భానుడు ప్రతాపం చూపిస్తున్న కానీ ఎక్కడా తగ్గకుండా పరుగో పరుగు అంటూ పరుగులు పెట్టారు. అయితే వారి వెనుకు పెళ్లికి వచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ వారు ఎందుకు పరుగు పెట్టారు అనే విషయం అయితే ఇంకా తెలియరాలేదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఫుల్ వైరల్ గా మారింది.