Site icon 123Nellore

అందరూ ఏపీవైపే వేలెత్తి చూపిస్తారేంటి.. అప్పులు ఎవరు చేయరు చెప్పండి- విజయ్​ సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రోజురోజుకూ అప్పులకుప్పగా మారిపోతోంది. ఉద్యోగులకు జీలాతు, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేసి స్థితికి చేరుకుంది. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక, ఉన్న ఆస్తులను వేలం వేస్తూ.. ఆఖరికి పంచాయితీ నిధులను కూడా వాడేస్తున్నారనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్షాాలు, కేంద్ర ఆర్థిక శాఖ  వేలెత్తి చూపించే స్థితికి చేరుకుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఎన్టీఆర్​ హెల్త్ యూనివర్సిటీ డబ్బును కూడా మింగేస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఏపీ ప్రభుత్వ అప్పులపై స్పందించడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ క్రమంలోనే వైసీపీ నాయకుడు ఎంపీ, విజయ్​ సాయిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు అప్పులు చేస్తున్నారని ఎందుకు అందరు ఏపీవైపే వేలెత్తి చూపిస్తున్నారు. అసలు ఎవరు చేయరు చెప్పండి.. అంటూ సమర్థించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా అప్పుల బావిలో కూరుకుపోయిందని.. ఆ విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు సాయిరెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామని అవుతున్న అమెరికా.. రుణ పరిమితిని పెంచుకునేందుకు కాంగ్రెస్​నుంచి 2.5 ట్రిలియన్లకు అనుమతి తీసుకుందని.. ప్రస్తతం కరోనా కాలంలో అగ్రరాజ్యాలే అతలాకుతలం అవుతుంటే.. అప్పులు కాక ఇంకేమవుతాయని ప్రశ్నించారు.

 

అవును.. రాష్ట్రాన్ని బాగుచేయడానికి ప్రజల సంక్షేమం కోసం అప్పులు చేస్తే ఎవరూ కాదనరు.. అయితే, ఇక్కడ వస్తున్న ప్రశ్నేంటంటే.. అసలు తెచ్చిన వేల కోట్ల రూపాయలను ఏం చేస్తున్నారన్నదే. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. తెచ్చిన అప్పులతో ఒక్క పనైనా సవ్యంగా జరుగుతోందా? అన్నది తెలియాల్సింది.  ఉద్యోగాల కల్పన లేదు.. ఎక్కడా సరైన రోడ్లు లేవు.. కనీసం సంక్షేమ పథకాల అమలు కూడా సవ్యంగా సాగడం లేదని కళ్లముందు క్లియర్​గా కనిపిస్తోంది. మరి ఇన్ని కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అనేదే అందరి ప్రశ్న.

ఇవేవీ జరగకపోయినా.. కళ్ల ముందు మాత్రం కుప్పలుగా పేరుకుపోయిన అప్పులు కనిపిస్తున్నాయి. దీనికి మాత్రం నాయకుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. అందుతే, అందరూ ఏపీని అప్పుల రాష్ట్రంగా బిరుదును ప్రకటించారు.

ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి కళ్లెర్రజేస్తూ.. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని విరుచుకుపడింది. ఇప్పుడు విజయ్​సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. అప్పులు చేస్తే చేశారు కానీ.. ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ఓ సారి సెలవియ్యండి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ విపక్షాల మాటలపై విరుచుకుపడే సాయిరెడ్డి.. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

Exit mobile version