మీరు బండి కొనాలి అనుకుంటే ఏం చేస్తారు? ముందుగా ఏ బండి కొనాలి అనేది డిసైడ్ అవుతారు. తరువాత దాని కాస్ట్ ఎంత ఉంది అనేది చూస్తారు. అప్పుడు దానికి సంబంధిన మొత్తం మన దగ్గర ఉంటే వెంటనే కొనుగోలు చేయడం చేస్తాము. లేకపోతే కాస్తా వెయిట్ చేసి ఆ డబ్బులు వచ్చిన తరువాత కొంటాం. అదీ కుదరకపోతే ఈఎంఐ పెట్టుకుని నెలవారి ఇంత మొత్తం చెల్లిస్తాము. అయితే అసోంకు చెందిన ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. బండి కొన్నాడు. కానీ అతను ఆ బండి కొనుగోలు చేయడానికి సొమ్ము చెల్లించిన పద్ధతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసోం కు చెందిన హిరాక్ జే దాస్ కు బండి కొనాలని ఏడాది క్రితం అనిపించింది. దీంతో అప్పటి నుంచి ఆయన డబ్బులు దాచుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే ఆ డబ్బులు దాచిన విధానమే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే… దాస్ రూపాయి రూపాయి కూడబెట్టినట్లుగా ఆ స్కూటర్ కొనేందుకు మొత్తం చిల్లరనే తీసుకుని పోయాడు షోరూంకు. అది కూడా ఓ బస్తా. ఆ బస్తా చిల్లర తోనే బండి కొన్నాడు. అయితే చిల్లరను మొత్తం పోగు చేయడానికి ఆ వ్యక్తికి సుమారు 8 నెలలు పట్టింది. ఇంతకీ ఈయన అంత చిల్లరను ఎలా సంపాదించాడు అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఆయన అంత చిల్లర పొదుపు చేయడానికి ఆయన చేస్తోంది చిల్లర వ్యాపారమే. అందుకే అన్ని నాణాలను పోగు చేయగలిగారు.
దాస్ బండి కొనేందుకు తీసుకుని పోయిన ఆ చిల్లరను షోరూం సిబ్బంది చాలా ఓపిక తో లెక్కబెట్టారు. వాటిని విడి విడిగా ప్లాస్టిక్ బుట్టల్లో వేసుకుని మరీ లెక్కించారు. అయితే బండి కొనాలి అంటే ఇంత చిల్లర అవసరమా అని అంటూ నెటిజన్లు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. అయితే ఈ బండి కొనేందుకు చిల్లర తీసుకుని వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.