గత రెండు వారాలుగా నిరాశాజనకంగా ఉన్న నెల్లూరు బాక్స్ ఆఫీస్ లో ఈ వారం విడుదలైన చిత్రాల్లో నిఖిల్, అవికా, హెబ్బా పటేల్, నందిత శ్వేతలు నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకుని హిట్ దిశగా దూసుకుపోతున్నది. విడుదల రోజు మందకొడి ఓపెనింగ్స్ ఉండినా మధ్యాహ్నానికే మంచి టాక్ తెచ్చుకుని హిట్ గా నిలబడింది ఈ చిత్రం. మొదటి మూడు రోజులే కాకుండా సోమవారం కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం ఎస్2 సినిమాస్ మరియు అర్చన థియేటర్ లలో మొత్తం 8 ఆటలు ఆడుతున్నది. ఇక మిగిలిన చిత్రాల్లో లీలామహల్ లో ప్రదర్శితమవుతున్న ఆంగ్ల అనువాద చిత్రం ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్’ మల్టీప్లెక్స్ వర్గ ప్రేక్షకులను కొంత మేర ఆకట్టుకోగలిగింది. నాగచైతన్య, మంజిమా మోహన్ ల ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రానికి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఇవి మినహాయించి నగరంలో ప్రదర్శితమవుతున్న మిగిలిన చిత్రాలేవీ ఆశాజనకమైన స్థితిలో లేవు.