నెల్లూరు నగరంలో ఈ వారం విడుదలైన చిత్రాల్లో శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం ఎస్2 సినిమాస్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అంధ విశ్వాసాలను నమ్మకుండా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోవాలని తెలిపే ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. కీర్తి సురేష్, శివ కార్తికేయన్ ల ‘రెమో’ చిత్రానికి ఎస్2 సినిమాస్ లో ఓపెనింగ్స్ బాగున్నాయి. ఈ చిత్రం యావరేజ్ గా మిగిలే అవకాశాలున్నాయి. షారుఖ్ ఖాన్, ఆలియా భట్ ల ‘డియర్ జిందగీ’ హిందీ చిత్రాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంటున్నది. నర్తకిలో విడుదలైన జీవా, తులసి నాయర్ ల ‘రంగం 2’ కొద్దిపాటి మాస్ ప్రేక్షకులకే పరిమితమైంది. ఇక పోతే లీలామహల్ లో ఆడుతున్న నాగచైతన్య, మంజిమ మోహన్ ల ‘సాహసం శ్వాసగా సాగిపో’ ప్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. సిరి మల్టీప్లెక్స్ లో ఆడుతున్న నిత్యామీనన్ ‘ఘటన’ చిత్రం వేరే చిత్రాల విడుదల ఏమీ లేక కొనసాగుతుంది. మొత్తమ్మీద ఈ వారం నెల్లూరు నగరంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఆశాజనకంగా ఉంది.